స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పటినుంచంటే..?

––
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈసారి దసరా సెలవులు భారీగానే ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి రెండు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలీడేస్ ప్రకటించనున్నారు.

ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజులు సెలవులు వచ్చాయి.


More Telugu News