ఆ విషయంలో... తండ్రి సచిన్ బాటలోనే అర్జున్ టెండూల్కర్!
- ఇటీవల సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు నిశ్చితార్థం
- సానియా చందోక్‌తో ఘనంగా జరిగిన ఎంగేజ్‌మెంట్
- అర్జున్ కంటే సానియా వయసులో ఏడాది పెద్ద
- ప్రేమ విషయంలో తండ్రి సచిన్‌నే అనుసరించిన అర్జున్
- సచిన్ భార్య అంజలి కూడా ఆయన కంటే వయసులో పెద్ద
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ తన జీవితంలో ఓ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. తన స్నేహితురాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నెల 13న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అర్జున్ తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ఆయన తన తండ్రి సచిన్‌నే అనుసరించడం విశేషం.
ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ వయసు 25 ఏళ్లు. 1999 సెప్టెంబర్ 24న జన్మించాడు. అర్జున్ కాబోయే భార్య సానియా చందోక్ 1998 జూన్ 23న పుట్టింది. అంటే, అర్జున్ కంటే ఆమె దాదాపు ఏడాది పెద్ద. సరిగ్గా ఇలాంటి విశేషమే సచిన్, అంజలి ప్రేమకథలోనూ ఉంది. సచిన్ తనకంటే ఆరేళ్లు పెద్దదైన అంజలిని 1995లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. సచిన్ 1973లో జన్మించగా, అంజలి 1967లో జన్మించారు. అప్పట్లో ఇది కాస్త భిన్నంగా అనిపించినా, వారి జంట భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఆదర్శవంతమైన జంటగా నిలిచింది. ఇప్పుడు అర్జున్ కూడా అదే బాటలో పయనిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక కెరీర్ విషయానికొస్తే, అర్జున్ టెండూల్కర్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, 2023లో అరంగేట్రం చేశారు. ప్రస్తుతం క్రికెట్‌లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న అర్జున్, వ్యక్తిగత జీవితంలో ఈ నిశ్చితార్థంతో కీలక ముందడుగు వేశారు.