'మార్వాడీ గో బ్యాక్', కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశాలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
- మార్వాడీలు మనలో ఒకరు.. వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్న టీపీసీసీ చీఫ్
- బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
- రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలుసుకుంటామని వెల్లడి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలుసుకుంటామని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తామనే హామీతోనే పార్టీలో తిరిగి చేర్చుకున్నారని, తాను పార్టీలో చేరినప్పుడు ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామనే విషయం తెలియదా అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ పైవిధంగా స్పందించారు.