తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచన
  • జలాశయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచన
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

వర్షాల ప్రభావం అధికంగా ఉండే జిల్లాల్లో ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహా అన్ని సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వాగులు పొంగే ప్రమాదమున్న జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.


More Telugu News