74 ఏళ్ల వయసులోనూ జిమ్‌లో రజనీకాంత్ వర్కవుట్స్.. వీడియో ఇదిగో!

  • ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్‌లో రజనీ వర్కవుట్స్
  • ఇన్‌క్లైన్ డంబెల్ ప్రెస్ సాధన.. ఆ తర్వాత స్క్వాట్స్
  • ఈ వయసులోనూ ఫిట్‌నెస్ పట్ల అంకితభావం
  • ఫిదా అవుతున్న యువత
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జిమ్ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 74 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన ఫిట్‌నెస్ పట్ల చూపుతున్న అంకితభావం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఎక్స్‌లో ఒక యూజర్ షేర్ చేసిన వీడియోలో రజనీకాంత్ తన ట్రైనర్ పర్యవేక్షణలో జిమ్ వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. వీడియో మొదటి భాగంలో రజనీకాంత్ ‘ఇన్‌క్లైన్ డంబెల్ ప్రెస్’ సాధన చేస్తున్నారు. వాలుగా ఉన్న సీటుపై పడుకుని రెండు చేతులతో డంబెల్స్ పట్టుకుని చేతి కండరాలకు పని చెబుతున్నారు. వీడియో తర్వాతి భాగంలో రజనీకాంత్ జిమ్ బెంచ్‌పై కూర్చుని, మళ్ళీ నిలబడుతూ 'స్క్వాట్స్' చేస్తున్నారు. ఈ వ్యాయామాన్ని ఆయన చాలాసార్లు పునరావృతం చేశారు. వీడియో చివరిలో ఆయన తన ఫిట్‌నెస్ కోచ్‌తో కలిసి తన కండరాలను ప్రదర్శిస్తున్న దృశ్యం కూడా ఉంది.

ఇన్‌క్లైన్ డంబెల్ ప్రెస్ ప్రయోజనాలు
ఇన్‌క్లైన్ డంబెల్ ప్రెస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాతీ పై భాగాన్ని బలోపేతం చేయడంలో, భుజాల స్థిరత్వాన్ని పెంచడంలోను, భంగిమను మెరుగుపరచడంలోను, కండరాల అసమతుల్యతను నివారించడంలోను సహాయపడుతుంది. రజనీకాంత్ తాజాగా నటించిన 'కూలీ' చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, రచ్చిత రామ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్, పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలలో కనిపించారు. 


More Telugu News