పాక్ ఉగ్రవాదులతో ధర్మవరం వాసికి సంబంధం.. సత్యసాయి జిల్లాలో కలకలం
––
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం కలకలం చోటుచేసుకుంది. మార్కెట్ వీధిలోని ఓ టీస్టాల్‌లో పనిచేస్తున్న నూర్ మహమ్మద్ ను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నూర్ మహమ్మద్ పాకిస్థాన్ ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన ఐబీ అధికారులు.. స్థానిక పోలీసులతో కలిసి ధర్మవరంలో తనిఖీలు చేపట్టారు.
కోట కాలనీలో నూర్ మహమ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఐబీ అధికారులు అతడి నివాసంలో తనిఖీలు చేసి పలు అనుమానిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతనిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నూర్ మహమ్మద్ తరచూ పాకిస్థాన్ కు ఫోన్లు చేస్తున్నాడని, అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని అధికారవర్గాల సమాచారం.