నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది .. ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నా: నటి మృణాల్ ఠాకూర్
- నటి మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యల వీడియో వైరల్
- బాడీ షేమింగ్ వ్యాఖ్యలపై నెటిజన్లు, బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి తీవ్ర విమర్శలు
- ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా క్షమాపణలు చెప్పిన మృణాల్
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో నటి బిపాసా బసుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ విషయంపై మృణాల్ తాజాగా స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్షమాపణలు తెలిపారు.
వైరల్ అవుతున్న వీడియోలో, మృణాల్ తాను బిపాసా కంటే అందంగా ఉంటానని, ఆమె "కండలు తిరిగిన పురుషుడిలా" కనిపిస్తారని పేర్కొనడం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు నెటిజన్లు, బాలీవుడ్ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను బాడీ షేమింగ్‌గా అభివర్ణిస్తూ తీవ్రంగా విమర్శించారు.
ఈ నేపథ్యంలో స్పందించిన మృణాల్, "అది నేను 19 ఏళ్ల వయసులో సరదాగా మాట్లాడిన వీడియో. ఆ సమయంలో నా మాటల వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందన్న భావన నాకుండేది కాదు. నేను ఎవరినీ అవమానించాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా విచారిస్తున్నాను. శరీర సౌందర్యం అంటే ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతోంది," అంటూ భావోద్వేగపూరితంగా పేర్కొన్నారు.
ఇక బిపాసా బసు కూడా ఈ వివాదంపై పరోక్షంగా స్పందిస్తూ, "మహిళలంతా శారీరకంగా బలంగా ఉండాలి. మగాళ్లా కనిపించకూడదనే పాత ఆలోచనల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు.