హిందూపురంలో ఆర్టీసీ బస్సు నడిపిన బాలకృష్ణ... వీడియో ఇదిగో!

  • హిందూపురంలో 'స్త్రీ శక్తి' పథకాన్ని ప్రారంభించిన బాలకృష్ణ
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీకి శ్రీకారం
  • ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలయ్య
  • మహిళా ప్రయాణికుల ఆధార్ కార్డులను స్వయంగా తనిఖీ
  • బస్టాండ్ నుంచి తన ఇంటి వరకు బస్సు నడిపిన ఎమ్మెల్యే
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం 'స్త్రీ శక్తి' ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సు నడిపారు. ఈ పరిణామం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఎన్నికల హామీలలో భాగమైన 'సూపర్ సిక్స్' పథకాలలో ఒకటైన 'స్త్రీ శక్తి'ని ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని బాలకృష్ణ తన నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం హిందూపురం ఆర్టీసీ బస్ స్టేషన్‌కు అభిమానుల కోలాహలం మధ్య చేరుకున్న ఆయన, ముందుగా రిబ్బన్ కట్ చేసి పథకానికి శ్రీకారం చుట్టారు.

అనంతరం ఓ బస్సులోకి ఎక్కి, అందులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారి ఆధార్ కార్డులను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ జాతీయ జెండా ఊపి బస్సును ప్రారంభించగా, బాలకృష్ణ డ్రైవర్ సీటులో ఆసీనులయ్యారు. బస్ స్టేషన్ నుంచి పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో ఉన్న తన నివాసం వరకు బస్సును నడుపుకుంటూ వెళ్లారు. తమ ఎమ్మెల్యేనే బస్సు నడపడంతో ప్రయాణికులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు.


More Telugu News