Road Accident: ఆళ్లగడ్డలో ఢీకొన్న రెండు బస్సులు.. ముగ్గురి మృతి
- నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం
- తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న సమయంలో ఘటన
- ఆళ్లగడ్డలోని ఆల్ఫా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రమాదం
నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, సుమారు 18 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న రెండు బస్సులు ఆళ్లగడ్డలోని ఆల్ఫా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఢీకొన్నాయి. ముందు వెళుతున్న జగన్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వెళుతున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగన్ ట్రావెల్స్ బస్సులోని ఇద్దరు, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులోని ఒకరు దుర్మరణం పాలయ్యారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. రెండు బస్సుల మధ్య మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లెయిన్ సహయంతో బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం 108 సిబ్బంది నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు.