టాలీవుడ్‌పై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

  • జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై అసంతృప్తి
  • తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనని వ్యాఖ్య
  • 'సైమా' స్పందించి విజేతలను సత్కరించడం అభినందనీయమన్న అరవింద్
జాతీయ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించకపోవడంపై ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'సైమా' (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనని వ్యాఖ్యానించారు.

జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకు ఏడు అవార్డులు వచ్చాయని, 'సైమా' స్పందించి అవార్డు విజేతలను సత్కరించడం అభినందనీయమని అన్నారు. జాతీయ అవార్డులు వచ్చినా మన సినిమా పరిశ్రమ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ అవార్డులను ఒక పండుగగా జరుపుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 5, 6 తేదీల్లో 'సైమా' వేడుక జరగనుంది.


More Telugu News