గెలిచామని మీరు అనుకుంటున్నారు.. ప్రజలు అనుకోవడం లేదు: వైఎస్ అవినాశ్ రెడ్డి

  • ఓటర్లను పోలింగ్ బూత్ లలోకి పోనివ్వలేదన్న అవినాశ్ రెడ్డి
  • అసలైన ఓటర్లు ఓటు వేయలేదని వ్యాఖ్య
  • వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్న అవినాశ్ రెడ్డి
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజమైన ఓటర్లను అసలు పోలింగ్ బూత్ లలోకి పోనివ్వలేదని ఆయన అన్నారు. దీన్ని ఎవరైనా ఎలక్షన్ అంటారా? అని మండిపడ్డారు. ఎన్నికలలో గెలిచామని మీరు అనుకుంటున్నారే కానీ... ప్రజలు అనుకోవడం లేదని చెప్పారు. 

ప్రజలు ఓటు వేస్తే కదా... మీరు గెలిచామని చెప్పుకోవడానికి అని అవినాశ్ అన్నారు. మీకు ఓటు వేసిన మీ దొంగ ఓటర్లు కూడా మీరు గెలిచారని అనుకోవడం లేదని ఎద్దేవా చేశారు. అసలైన ఓటర్లు ఓటు వేయలేదు కాబట్టి మీరు గెలిచారని వాళ్లు అసలే అనుకోరని చెప్పారు. 

ఈ ఎన్నికల ఫలితాలతో వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని అవినాశ్ అన్నారు. వీరికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుందని చెప్పారు. అప్పుడు మనం వీళ్ల మాదిరి దొంగ ఓట్లతో కాకుండా... మనం ఎప్పుడూ చేసే విధంగా నిజమైన ఓటింగ్ తోనే వీళ్లకు గుణపాఠం చెబుదామని అన్నారు.


More Telugu News