పులివెందుల విజేత లతారెడ్డికి ఫోన్ చేసి అభినందించిన నారా భువనేశ్వరి
- పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విక్టరీ
- ఘనవిజయం సాధించిన బీటెక్ రవి అర్ధాంగి లతారెడ్డి
- పులివెందులలో గెలిస్తే జోష్ ఎక్కువ కదా అంటూ భువనేశ్వరి స్పందన
- మనం అందరం ఒకే కుటుంబం అంటూ వ్యాఖ్యలు
"లత గారూ.. మీరు సాధించిన విజయం పట్ల మేమెంతో హ్యాపీగా ఉన్నాం" అని అన్నారు. అందుకు లతారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. "థాంక్యూ అమ్మా... నా విజయానికి మీరు కూడా కారణం అమ్మా... అందరూ కలిసికట్టుగా కృషి చేశారమ్మా..." అంటూ వినమ్రంగా బదులిచ్చారు. అందుకు నారా భువనేశ్వరి స్పందిస్తూ... "అవును, ఈ విజయం అందరిదీ... ప్రతి ఒక్కరిదీ... అయినా పులివెందులలో గెలుపు అంటే ఇంకొంచెం జోష్ ఎక్కువ కదా! మీకు మరొక్కసారి శుభాభినందనలు... మనందరం ఒకే కుటుంబం" అని అన్నారు. "మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా... జై తెలుగుదేశం" అంటూ లతారెడ్డి బదులిచ్చారు.