Dil Raju: సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం.. నిర్మాతల నుంచి షరతులు ఉన్నాయన్న దిల్ రాజు

Dil Raju on Conditions for Cinema Workers Wage Hike
  • వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడి
  • మరో రెండు, మూడుసార్లు చర్చలు జరగాల్సి ఉందన్న దిల్ రాజు
  • పని విధానాలకు అంగీకరిస్తే వేతనాల పెంపుకు సిద్ధమన్న దిల్ రాజు
సినీ కార్మికుల వేతనాలు పెంచాలని ఫెడరేషన్ గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తోందని, అయితే నిర్మాతల నుంచి కొన్ని షరతులు ఉన్నాయని ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. వేతనాల పెంపు అంశంపై నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. మరో రెండు, మూడుసార్లు చర్చలు జరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. పని విధానాలకు అంగీకరిస్తే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు.

వేతనాలు పెంచాలని ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నప్పటికీ నిర్మాతల నుంచి షరతులు ఉన్నాయని, అందుకే వేతనాల పెంపు అంశం కొలిక్కి రాలేదని అన్నారు. ముఖ్యంగా 2018, 2022లలో జరిగిన అగ్రిమెంట్స్‌లో ఉన్న రెండు షరతులను ఫెడరేషన్ అమలు చేయడం లేదని విమర్శించారు.

మొదట వాటిని అంగీకరించాలని, వాటితో పాటు మరో రెండు షరతులు కూడా ఉన్నాయని దిల్ రాజు తెలిపారు. ఈ విషయాన్ని ఛాంబర్ ద్వారా వారి దృష్టికి తీసుకువచ్చామని, వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటే వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

రూ. 2 వేలు కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ, అంతకంటే ఎక్కువ తీసుకునే వారికి మరొక పర్సంటేజీ ఇవ్వాలని ప్రతిపాదించామని తెలిపారు. ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్‌లతో మాట్లాడుకుని వస్తే దీనిని పరిష్కరిస్తామని అన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో అన్ని అంశాలను చర్చించామని, ప్రస్తుతం సానుకూల ధోరణితో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.
Dil Raju
Telugu cinema workers
Tollywood
film industry wages
film federation
producers council

More Telugu News