రీపోలింగ్ జరిపించాలన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన

  • ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్ ఉన్నారన్న చంద్రబాబు
  • పులివెందులలో నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితి ఉండేదన్న సీఎం
  • ఈసారి ప్రజలు ధైర్యంగా ఓటేశారని వ్యాఖ్య
పులివెండుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి, రీపోలింగ్ జరిపించాలన్న వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్ ఉన్నారని విమర్శించారు. జగన్ వైఖరి ఏమిటో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 

పులివెందులలో నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితి ఉండేదని... అలాంటిది, ఇప్పుడు 11 మంది ఎన్నికల్లో పోటీ చేశారని చంద్రబాబు చెప్పారు. ఉప ఎన్నికలు జరిగిన రెండు పోలింగ్ బూత్ లలో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు ధైర్యంగా ఓటేశారని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి పులివెందులలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పులివెందుల ఉప ఎన్నికపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు.



More Telugu News