సెమీకండక్టర్ ప్రాజెక్టుపై తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది: శ్రీధర్ బాబు
- తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిందన్న శ్రీధర్ బాబు
- ఒక ఎకరా కేటాయించకపోయినా ఏపీకి ప్రాజెక్టుకు కేటాయించారన్న మంత్రి
- కేంద్రం నిర్ణయాలు తెలంగాణకు అవమానకరంగా ఉన్నాయని వ్యాఖ్య
సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు అవమానకరంగా ఉన్నాయని చెప్పారు.
కేంద్రం విధానాలను తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఇలాంటి నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు. సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రైమ్ లొకేషన్ లో 10 ఎకరాల స్థలం కూడా కేటాయించిందని తెలిపారు.
ఇదే ప్రాజెక్ట్ కు ఏపీ ప్రభుత్వం ఒక ఎకరా కూడా కేటాయించకపోయినా... కేంద్రం ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు అవమానకరంగా ఉన్నాయని మండిపడ్డారు.