బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో నేడు, రేపు అతి భారీ వర్షాలు

  • పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
  • రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం
  • దీని ప్రభావంతో కోస్తాలో నేడు, రేపు అతిభారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ వివరాలను వెల్లడించారు. 

పశ్చిమమధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆయన తెలిపారు. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి, ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల వైపుగా పయనించే అవకాశం ఉందని వివరించారు.

ఈ అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.


More Telugu News