నేడు, రేపు తెలంగాణ అంత‌టికీ రెడ్ అల‌ర్ట్ జారీ

  • భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో తెలంగాణ అంత‌టికీ రెడ్ అల‌ర్ట్ జారీ చేసిన‌ వాతావ‌ర‌ణ కేంద్రం
  • ఈ మేర‌కు వాతావ‌ర‌ణ కేంద్రం డైరెక్ట‌ర్ నాగ‌ర‌త్న ప్ర‌క‌టన‌
  • రాష్ట్ర‌వ్యాప్తంగా రేపు కూడా వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డి
భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ఇవాళ‌, రేపు తెలంగాణ అంత‌టికీ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ మేర‌కు వాతావ‌ర‌ణ కేంద్రం డైరెక్ట‌ర్ నాగ‌ర‌త్న ప్ర‌క‌టించారు. ఖమ్మం, భ‌ద్రాద్రి, మెద‌క్‌, వికారాబాద్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లాల‌కు రెడ్ అలర్ట్ జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 

అలాగే కామారెడ్డి, జ‌న‌గామ‌, కుమురం భీం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌, మంచిర్యాల‌, న‌ల్గొండ‌, రంగారెడ్డి, సిద్ధిపేట‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, మ‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల జిల్లాల‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన‌ట్లు తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా రేపు కూడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇక‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు ప‌డొచ్చ‌ని నాగ‌ర‌త్న చెప్పారు. 




More Telugu News