Nagarjuna Sagar: నిండుకుండలా నాగార్జునసాగర్... 24 గేట్ల ఎత్తివేత

Nagarjuna Sagar Dam Reaches Full Capacity Gates Opened
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. దీంతో, శ్రీశైలం, నాగార్జునసాగర్ కు భారీగా వద నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్ ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఉండగా 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

ఇక సాగర్ కు ఇన్ ఫ్లో 1,74,533 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరుకుంది.
Go Back to Shorts
Nagarjuna Sagar
Nagarjuna Sagar Dam
Telangana Rains
Krishna River
Srisailam Dam
Reservoir Gates Lifted
Heavy Rainfall Telangana
Nagarjuna Sagar Water Level
Telangana Floods
Dam Overflow

More Telugu News