Chandrababu Naidu: అమరావతి పనులు రికార్డు సమయంలో పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Completing Amaravati Works Quickly
  • అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష
  • మొత్తం రూ. 81,317 కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ప్రతిపాదన
  • ఇప్పటికే రూ. 50,552 కోట్ల పనులకు టెండర్లు పూర్తి
  • సమీక్షకు హాజరైన మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు
  • భవనాలు, రోడ్లు, వరద నియంత్రణ పనులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను రికార్డు సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు. రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని, పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణతో పాటు సీఆర్డీఏ, ఏడీసీకి చెందిన ఉన్నతాధికారులు, నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు. రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లు, పనుల ప్రస్తుత దశపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు.

అమరావతిలో చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రాజధానిలో మొత్తం రూ. 81,317 కోట్ల విలువైన పనులను చేపట్టాలని సీఆర్డీఏ ప్రతిపాదించగా, ఇప్పటివరకు రూ. 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రధానంగా భవన నిర్మాణాలు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్పీఎస్) పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రధాన రహదారులు, డక్టుల వంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులతో పాటు వరద నియంత్రణ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు.

నిర్దేశిత లక్ష్యాల మేరకు పనుల్లో వేగం పెంచి, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Capital City Construction
CRDA
Land Pooling Scheme
Infrastructure Development
AP Municipal Department
P Narayana

More Telugu News