Su From So: పెట్టింది 5 కోట్లు .. తెచ్చింది 80 కోట్లకి పైనే!

Su From So Movie Update
  • కన్నడలో రూపొందిన 'సు ఫ్రమ్ సో'
  • చిన్న సినిమా సాధించిన పెద్ద విజయం
  • గ్రామీణ నేపథ్యంలో ఆకట్టుకునే వినోదం   
  • త్వరలో స్ట్రీమింగుకి రానున్న కంటెంట్

'కాంతార' నుంచి తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన కన్నడ సినిమాలు తమ జోరును కొనసాగిస్తూనే ఉన్నాయి. కంటెంట్ బాగుంటే చాలు, బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేస్తున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో ఇప్పుడు 'సు ఫ్రమ్ సో' కూడా చేరిపోయింది. జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా .. ఎలాంటి హడావిడి లేకుండా థియేటర్లలో ఈ సినిమా అడుగుపెట్టింది. 

ఈ సినిమాలో స్టార్స్ లేరు .. భారీ బడ్జెట్ తో నిర్మించింది కాదు. కేవలం ఐదున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. అలాంటి ఈ సినిమా ఇంతవరకూ 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు కన్నడ ప్రాంతంలోనే కాదు, ఇతర ప్రాంతాలలోనివారు సైతం కొన్ని రోజులుగా  ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా చూడనివారు, అంత ఘనమైనది ఈ కథలో ఏముందా అనే కుతూహలంతో ఉన్నారు.  

ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఆగస్టు చివరివారంలో గానీ .. సెప్టెంబర్ మొదటివారంలో గాని ఈ సినిమాను స్ట్రీమింగులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక తప్పు చేస్తూ దొరికిపోయిన హీరో ఆ గండం నుంచి బయటపడటం కోసం, తనకి దెయ్యం పట్టిందని అబద్ధమాడతాడు. అతను ఆడిన అబద్ధం అతణ్ణి ఎలాంటి ప్రమాదంలో పడేసిందనేదే కథ. 

Su From So
Su From So Kannada Movie
Kannada Cinema
JP Tuminad
Amazon Prime
OTT Release
Kannada Film Industry
Low Budget Movie Success

More Telugu News