ఆక‌ట్టుకుంటున్న జాన్వీ కపూర్ ‘ప‌ర‌మ్ సుంద‌రి’ ట్రైల‌ర్

  • జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా ‘పరమ్ సుందరి’
  • మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మాణం.. తుషార్ జలోటా ద‌ర్శ‌క‌త్వం
  • ఈ నెల‌ 29న విడుద‌ల కానున్న సినిమా
  • తాజాగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన మేక‌ర్స్‌
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’.  మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీకి తుషార్ జలోటా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఈ నెల‌ 29న విడుద‌ల కానుంది. దీంతో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో జోరు పెంచారు. 

ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను రిలీజ్‌ చేశారు. ఇక‌, ఈ ట్రైల‌ర్ చూస్తుంటే పంజాబీ యువ‌కుడు, మలయాళీ యువ‌తి మ‌ధ్య సాగే ప్రేమకథాగా సినిమా తెరకెక్కిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ భావోద్వేగాల‌తో కూడిన ఈ ట్రైల‌ర్ చూడ‌గానే ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాలో సంజయ్ కపూర్, మంజ్యోత్ సింగ్, రెంజి పనీకర్ వంటి నటులు కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. కాగా, 'దేవ‌ర‌'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న 'పెద్ది' మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 






More Telugu News