చంద్రబాబు, పవన్ అపాయింట్ మెంట్ కావాలని సినీ నిర్మాతలు కోరారు: కందుల దుర్గేశ్
- కందుల దుర్గేశ్ తో భేటీ అయిన సినీ నిర్మాతలు
- ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చ
- ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్న మంత్రి
టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తో సమావేశమయ్యారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫిలిం ఫెడరేషన్ స్ట్రైక్ గురించి మంత్రికి సినీ ప్రముఖులు వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో కందుల దుర్గేశ్ మాట్లాడుతూ... నిర్మాతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య సమస్యకు చర్చల ద్వారా సమాధానం లభిస్తుందని తెలిపారు.
సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్ మెంట్ కావాలని నిర్మాతలు కోరారని... త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పామని మంత్రి తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ప్రధానంగా చర్చించామని చెప్పారు. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీలో ఉన్న ట్యాలెంట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.