కొండా సురేఖ ఇంటి ముందు ఉద్రిక్తత

  • హన్మకొండలో సురేఖ ఇంటి ముందు మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
  • మధ్యాహ్న భోజనన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని డిమాండ్
  • సురేఖ ఇంట్లోకి చొరబడేందుకు యత్నం
హన్మకొండలోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు మధ్నాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. అక్షయపాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని కేటాయించే ప్రతిపాదనను విరమించుకోవాలని నినాదాలు చేశారు. ఈ నిర్ణయం కారణంగా మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. 

ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే 8 నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సురేఖ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకుని, చెదరగొట్టారు.


More Telugu News