రతన్ టాటా బతికి ఉంటే.. ఇంత ఆలస్యం జరిగేది కాదు!

  • ఎయిర్ ఇండియా ప్రమాదంపై అమెరికా లాయర్ కీలక వ్యాఖ్యలు
  • విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారంలో జాప్యంపై ఆవేదన
  • అమెరికాలో కూడా రతన్ టాటా గురించి తెలుసని వెల్లడి
  • సిబ్బందిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే వారని వ్యాఖ్య
‘తన సిబ్బందిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే రతన్ టాటానే ఇప్పుడు బతికి ఉంటే బాధితులకు పరిహారం అందించే విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదు’.. అంటూ ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై అమెరికా లాయర్ మైక్‌ ఆండ్రూస్‌ వ్యాఖ్యానించారు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చనిపోయిన 65 మంది కుటుంబాల తరఫున ఆండ్రూస్‌ కోర్టులో వాదిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎయిర్ ఇండియా రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించిందని ఆండ్రూస్ గుర్తుచేశారు. అయితే, ప్రమాదం జరిగి ఇప్పటికే 3 నెలలు గడిచినా పరిహారం మాత్రం అందించలేదని విమర్శించారు.

టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ రతన్‌ టాటా బతికి ఉంటే పరిహారం విషయంలో ఇంత ఆలస్యం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అమెరికాలో కూడా రతన్ టాటా గురించి కొంత తెలుసని ఆయన చెప్పారు. తన సిబ్బందిని రతన్ టాటా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని చెబుతూ.. బాధిత కుటుంబాల మానసిక క్షోభను ఆయన గుర్తించేవారని అభిప్రాయపడ్డారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు, విద్యార్థుల కుటుంబాలకు రతన్ టాటా వెంటనే న్యాయం చేసేవారని ఆండ్రూస్ అన్నారు. 


More Telugu News