కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కింద లక్షల కోట్ల ఆదాయం వస్తుంది: గోనె ప్రకాశ్ రావు
- రాజ కుటుంబ ఆస్తులు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులు ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్నాయన్న గోనె
- బ్రిటీష్ చట్టం కాబట్టి ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని వెల్లడి
- రేవంత్ ను కలిసి అన్ని వివరాలను వివరిస్తానన్న గోనె
తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఆరు రాజ కుటుంబాల ఆస్తులు, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఆస్తులు ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. బ్రిటీష్ చట్టం కాబట్టి దీనిపై ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టి ల్యాండ్ క్రూజర్లు, ఇన్నోవా కార్లపై మాత్రమే ఉందని... ప్రతి మంత్రి హెలికాప్టర్ లో తిరగాలని ప్లాన్ చూస్తున్నారని... తాను మాత్రం ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని చూస్తున్నానని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ను తాను కోరానని... వారిని కలిసి అన్ని వివరాలను వివరిస్తానని గోనె చెప్పారు. ఏఐసీసీ పెద్దలకు కూడా తన వద్ద ఉన్న వివరాలను అందిస్తానని తెలిపారు. మరో రెండు రోజుల్లో సీనియర్ నేత జానారెడ్డిని కలుస్తానని... ఆ ఆస్తులను కాపాడాలని జానారెడ్డిని కోరుతానని చెప్పారు. ఇదే విషయంపై గతంలో అడ్వొకేట్ జనరల్ తో జానారెడ్డి మాట్లాడారని తెలిపారు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆ ఆదాయాన్ని సమకూర్చుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేసుకోవచ్చని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.