రాఖీ పండుగ అంటే కేవలం ఒక దారం కాదు: పవన్ కల్యాణ్
- రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
- రాఖీ అంటే అనుబంధాల భావోద్వేగాలకు సంకేతమన్న డిప్యూటీ సీఎం
- ఆడపడుచులకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ
రాఖీ పండుగ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు మధ్య అనుబంధాన్ని చూపే వేడుక రాఖీ పౌర్ణమి అని ఆయన చెప్పారు. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదని... అది మన మధ్య అనుబంధాలకు భావోద్వేగాల సంకేతమని పేర్కొన్నారు.
మహిళలకు మేలు చేయడానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తోందని పవన్ తెలిపారు. తల్లికి వందనం, దీపం-2 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రజాజీవితంలో తాను వేసే అడుగుల్లో ఆడపడుచులకు ఎప్పుడూ అండగా నిలుస్తానని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ మహిళల అభివృద్ధి కోసం ఆలోచిస్తుంటానని చెప్పారు.