దేశంలోని టాప్ 10 సురక్షిత నగరాలు ఇవే.. హైదరాబాద్ కు దక్కని చోటు

  • ప్రపంచంలోని సురక్షిత దేశాలు, నగరాల జాబితాను విడుదల చేసిన నంబియో సేఫ్టీ ఇండెక్స్
  • సురక్షిత దేశాల జాబితాలో ఇండియాకు 67వ స్థానం
  • దేశంలో అత్యంత సురక్షిత నగరంగా మంగళూరు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సురక్షిత దేశాలు, నగరాలు-2025 జాబితాను నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసింది. అందులో భారత్ కు చెందిన 10 నగరాలు కూడా ఉన్నాయి. భారత్ కు చెందిన సురక్షిత నగరాల్లో మంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఢిల్లీ అట్టడుగున ఉంది. గుజరాత్ లోని వడోదర, అహ్మదాబాద్, సూరత్ నగరాలు కూడా జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. టాప్ 10 జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో ఇండియా 67వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా 55.8 స్కోరును సాధించింది. 

నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం ఇండియాలోని టాప్ 10 నగరాలు:

సిటీఇండియా ర్యాంక్ప్రపంచ ర్యాంక్
మంగళూరు149
వడోదర285
అహ్మదాబాద్393
సూరత్4106
జైపూర్5118
నవీ ముంబై6128
తిరువనంతపురం7149
చెన్నై8158
పూణె9167
చండీగఢ్10175


More Telugu News