'అఖండ 2' డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య... సెప్టెంబర్ 25న రాక ఖాయం
- 'అఖండ 2: తాండవం' సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసిన బాలకృష్ణ
- సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల
- శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రం
- ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టి, కీలక పాత్రలో హర్షాలీ మల్హోత్రా
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'అఖండ 2: తాండవం' సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి బాలయ్య తన డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతమయ్యాయి.
ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది. "గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ ద్వయం ఊహలకు మించి 4X బ్లాక్‌బస్టర్ అందించబోతోంది. తాండవం భారీ స్థాయిలో ఉండనుంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సర్వం సిద్ధం" అని పోస్ట్‌లో పేర్కొంది. దీంతో సినిమా విడుదలపై అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
బాలకృష్ణ పుట్టినరోజున విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను ఆకాశమే హద్దుగా పెంచేసింది. శివుని వాహనమైన నంది, త్రిశూలం వంటి అంశాలతో బాలయ్యను ఉగ్రమైన, దైవిక అవతారంలో చూపించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని టీజర్ స్పష్టం చేసింది.
గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త నటిస్తుండగా, విలక్షణ నటుడు ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ చిత్రం 'బజరంగీ భాయిజాన్'లో మున్నీ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హర్షాలీ మల్హోత్రా ఇందులో 'జనని' అనే కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
బాలకృష్ణ, బోయపాటి కలయికలో ఇది నాలుగో చిత్రం కావడం గమనార్హం. రామ్ అచంట, గోపీచంద్ అచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, సి. రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జార్జియాలోని అందమైన లొకేషన్లతో పాటు, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.