: పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు
- జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో రణరంగంగా మారిన పులివెందుల
- పరస్పర దాడులు చేసుకుంటున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
- కొత్తపల్లి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీకి నిప్పంటించిన దుండగులు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట కావడంతో ఎన్నికలో గెలుపు కోసం టీడీపీ, వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచార పర్వంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పులివెందుల రణరంగంగా మారింది. ఇరు పార్టీల శ్రేణులు పరస్పర దాడులు కూడా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి.
మరోవైపు, టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండుగులు ఈ ఉదయం తగులబెట్టారు. పులివెందుల మండలం కొత్తపల్లి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు నిప్పంటించారు. టీడీపీ నేత బీటెక్ రవి, ఆయన భార్య, టీడీపీ అభ్యర్థి లతారెడ్డిలతో పాటు జిల్లా నేతలతో కూడిన ఫ్లెక్సీని తగులబెట్టారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.