అప్పటి వీడియోలు ఇప్పుడెందుకు?: చిరంజీవిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • గతంలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను అప్పుడే వెనక్కి తీసుకున్నానన్న నారాయణ
  • అప్పటి వీడియోలను వైరల్ చేస్తూ తనను బద్నాం చేస్తున్నారని మండిపాటు
  • తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శ
అగ్ర నటుడు చిరంజీవిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమేనని... అయితే మాట్లాడే ముందు చిరంజీవి విజ్ఞతతో మాట్లాడాలని అన్నారు. గతంలో తాను చిరంజీవి గురించి మాట్లాడానని... ఆ వ్యాఖ్యలను అప్పుడే వెనక్కి తీసుకున్నానని చెప్పారు. అయితే, ఆ వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తూ తనను బద్నాం చేయడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని చిరంజీవికే వదిలేస్తున్నానని చెప్పారు.  

రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయని నారాయణ అన్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినవే ఇప్పుడు రిపీట్ అవుతున్నాయని చెప్పారు. 

గతంలో జగన్ చేసిన అక్రమాలు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని నారాయణ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బీసీలపై సడన్ గా అంత ప్రేమ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. అసలు ఏ పార్టీ తరపున ఆమె బీసీ జపం చేస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.


More Telugu News