Bhuma Karunakar Reddy: భూమన అనుచరుల ఆగడాలు.. తిరుపతిలో దుకాణం కాంట్రాక్ట్ కోసం యువకుడిపై దాడి.. వీడియో ఇదిగో!

Bhuma Karunakar Reddy Followers Attack Youth for Shop Contract in Tirupati
షార్ట్స్‌లో చూడండి
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. భూమన ప్రధాన అనుచరుడు చైతన్య యాదవ్ ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేయడం సంచలనంగా మారింది. కార్ డెకార్స్ కు సంబంధించిన దుకాణం తనకివ్వాలని చైతన్య యాదవ్ ఈ దాడికి పాల్పడ్డాడు. తాజాగా భూమన అనుచరుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అనిల్ రెడ్డి ఓ గిరిజన యువకుడిపై దాడి చేశాడు. తిరుపతిలో శ్రీనివాసం వసతిగృహం ముందు ఉన్న దుకాణం కాంట్రాక్టు తనకు రాసివ్వాలంటూ బాధితుడిని నిర్బంధించాడు. అతనిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

ఎవరినీ వదిలిపెట్టబోం: హోం మంత్రి అనిత
రౌడీ రాజకీయం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఏపీ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. గిరిజన యువకుడిపై దాడి ఘటనలో నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, ఈ దాడికి సంబంధించిన సూత్రధారులనూ చట్టం ముందు నిలబెడతామని తేల్చిచెప్పారు. ‘‘తిరుపతిలో దాడికి పాల్పడిన వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేతల రాక్షస మనస్తత్వానికి ఈ దాడులే నిదర్శనం’’ అని హోంమంత్రి పేర్కొన్నారు.
Go Back to Shorts
Bhuma Karunakar Reddy
Tirupati
Andhra Pradesh
YSRCP
attack
contract
shop contract
Chaitanya Yadav
Anil Reddy
Home Minister Anita

More Telugu News