భూమన అనుచరుల ఆగడాలు.. తిరుపతిలో దుకాణం కాంట్రాక్ట్ కోసం యువకుడిపై దాడి.. వీడియో ఇదిగో!
- కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన అనిల్ రెడ్డి
- వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం
- దాడి చేసిన వారిని అరెస్టు చేశామని హోంమంత్రి వెల్లడి
- సూత్రధారులనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన హోంమంత్రి
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. భూమన ప్రధాన అనుచరుడు చైతన్య యాదవ్ ఇటీవల ఓ వ్యక్తిపై దాడి చేయడం సంచలనంగా మారింది. కార్ డెకార్స్ కు సంబంధించిన దుకాణం తనకివ్వాలని చైతన్య యాదవ్ ఈ దాడికి పాల్పడ్డాడు. తాజాగా భూమన అనుచరుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అనిల్ రెడ్డి ఓ గిరిజన యువకుడిపై దాడి చేశాడు. తిరుపతిలో శ్రీనివాసం వసతిగృహం ముందు ఉన్న దుకాణం కాంట్రాక్టు తనకు రాసివ్వాలంటూ బాధితుడిని నిర్బంధించాడు. అతనిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఎవరినీ వదిలిపెట్టబోం: హోం మంత్రి అనిత
రౌడీ రాజకీయం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఏపీ హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. గిరిజన యువకుడిపై దాడి ఘటనలో నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, ఈ దాడికి సంబంధించిన సూత్రధారులనూ చట్టం ముందు నిలబెడతామని తేల్చిచెప్పారు. ‘‘తిరుపతిలో దాడికి పాల్పడిన వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేతల రాక్షస మనస్తత్వానికి ఈ దాడులే నిదర్శనం’’ అని హోంమంత్రి పేర్కొన్నారు.