వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- కీలక వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన ఆర్బీఐ
- రేట్ సెన్సిటివ్ స్టాక్స్ పై అమ్మకాల ఒత్తిడి
- 166 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. కీలక రేట్లను ఆర్బీఐ స్థిరంగా ఉంచడం మార్కెట్లపై ప్రభావం చూపింది. రేట్ సెన్సిటివ్ స్టాక్స్ లో అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 166 పాయింట్లు నష్టపోయి 80,543కి పడిపోయింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 24,574 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.73గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిన్ తదితర కంపెనీలు నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి.