మొహాలీ ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు
- ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వార్తలు
- ప్లాంట్ వద్ద కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు
పంజాబ్ లోని మొహాలీలో భారీ పేలుడు సంభవించింది. మొహాలీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫేజ్ 9లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్‌లో ఈ పేలుడు జరిగింది. ఈ రోజు ఉదయం ప్లాంట్ లో పేలుడు సంభవించగా.. ఇద్దరు మృతి చెందారని, పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రత భారీగా ఉండడంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. ఘటనా స్థలంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య బృందాలు, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. ఘటనా స్థలంలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు.