Venkaiah Naidu: జీవితంలో నేను రెండుసార్లు కంటతడి పెట్టుకున్నా: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Says He Cried Only Twice in His Life
  • తాను అమ్మను చూడలేదన్న వెంకయ్యనాయుడు
  • ఉప రాష్ట్రపతి అయినప్పటి నుంచి బీజేపీ కార్యాలయానికి వెళ్లలేదని వెల్లడి
  • భాష విషయంలో నాయకులు హుందాగా వ్యవహరించాలని హితవు
తన జీవితంలో తాను కేవలం రెండుసార్లు కంటతడి పెట్టుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు కంటతడి పెట్టుకున్నానని చెప్పారు. తాను తన అమ్మను చూడలేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రెండోది, తనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పిలిచి ఉప రాష్ట్రపతిని చేసినప్పుడు కంటతడి పెట్టుకున్నానని చెప్పారు. తనకు రాజకీయాల నుంచి వైదొలగడం ఇష్టం లేదని ఆయన తెలిపారు. 

ఉప రాష్ట్రపతి అయినప్పటి నుంచి తాను ఇప్పటి వరకు బీజేపీ కార్యాలయానికి వెళ్లలేదని వెంకయ్యనాయుడు తెలిపారు. ఉప రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత యువత కోసం రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చెప్పారు. సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రాసిన 'విలీనం-విభజన-మన ముఖ్యమంత్రులు' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ పుస్తకాన్ని నేటి యువత తప్పనిసరిగా చదవాలని ఆయన సూచించారు. ఈ పుస్తకం చదివితే నాయకుల పాలన, వారి గురించి అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. వ్యూస్ కోసం మనం న్యూస్ రాయకూడదని అన్నారు. మన అభిప్రాయాలను పంచుకోవడానికి కాలమ్స్ ఉన్నాయని చెప్పారు. భాష విషయంలో నాయకులు చాలా హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. పాత్రికేయంలో కూడా భాష చాలా ముఖ్యమని చెప్పారు.
Venkaiah Naidu
Former Vice President
Telugu States
Politics
Inaganti Venkat Rao
Book Launch
Parliamentary Party
BJP
Political Life
Political Leaders

More Telugu News