Nimmala Ramanayudu: జగన్ హయాంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది: నిమ్మల రామానాయుడు

Nimmala Ramanayudu Criticizes Jagans Red Book Rule
  • ప్రజా సంక్షేమాన్ని జగన్ ఏనాడూ పట్టించుకోలేదన్న రామానాయుడు
  • సాక్షిలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • టిడ్కో ఇళ్లపై రుణం తీసుకుని జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణ
జగన్ హయాంలోనే రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... కక్షలు, అక్రమ కేసులు, దాడులు, విధ్వంస పాలన తప్పితే ప్రజా సంక్షేమాన్ని జగన్ ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. 

పాలకొల్లు వైసీపీ నేతలు క్రికెట్ బెట్టింగ్ లో దొరికినా, వారి అక్రమ సంపాదన వెలుగు చూసినా సాక్షి దినపత్రికలో ఎందుకు ప్రచురించలేదని రామానాయుడు ప్రశ్నించారు. తాను బాధ్యతతో పని చేస్తుంటే... సాక్షి దినపత్రికలో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వివిధ శాఖల నుంచి రూ. 430 కోట్ల పనులు తన నియోజవర్గంలో జరుగుతున్నాయని చెప్పారు. 

టిడ్కో గృహాల ప్రారంభోత్సవ సభలో స్టేజిపై నుంచి తమను గెంటివేసినప్పుడు సాక్షి పత్రిక ఏమైందని మండిపడ్డారు. తమపై దాడులు చేసి తమపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన చరిత్ర వైసీపీదని అన్నారు. తాము నిర్మించిన ఒక్కో టిడ్కో ఇంటిపై రూ. 3.65 లక్షల రుణం తీసుకుని గత జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు.
Nimmala Ramanayudu
Jagan
Red Book Constitution
Palakollu
YCP
Sakshi Newspaper
Tidco houses
Andhra Pradesh Politics
Illegal Cases
Betting

More Telugu News