Nirosha: కాలం అక్కడే ఆగిపోతే బాగుండేది: సీనియర్ హీరోయిన్ నిరోషా!

Nirosha Interview
  • తన కెరియర్ గురించి ప్రస్తావించిన నిరోషా 
  • స్టార్ హీరోల సరసన చేయడం అదృష్టమని వ్యాఖ్య  
  • 4 భాషల్లో 100కి పైగా సినిమాలు చేశానని వెల్లడి 
  • ఈ రోజుల్లో 'ఘర్షణ' రిలీజ్ అయితే బాగుండేదన్న నిరోషా
      
1990లలో వెండితెరపై సందడి చేసిన కథానాయికలలో నిరోషా ఒకరు. 'నారీనారీ నడుమ మురారి' .. 'కొబ్బరి బొండం' .. 'మధురానగరిలో' వంటి హిట్స్ ఇచ్చిన నిరోషాకి అప్పట్లో యూత్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఇక 'సిందూర పువ్వు' .. 'ఘర్షణ' వంటి సినిమాలు, అంతా ఆమెను గురించి మాట్లాడుకునేలా చేశాయి. అలాంటి నిరోషా ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. రీసెంటుగా ఆమె 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

"తెలుగులో నా ఫస్టు మూవీ బాలకృష్ణగారితో .. రెండవ సినిమా చిరంజీవిగారితో చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. తెలుగు .. తమిళ భాషల్లో గొప్ప దర్శకులతో నా కెరియర్ మొదలుకావడం కూడా నా అదృష్టమే. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో హీరోయిన్ గా 100కి పైగా సినిమాలు చేశాను. ఇన్ని సినిమాలు చేస్తానని నేనే అనుకోలేదు. ఒక రకంగా ఈ జనరేషన్ హీరోయిన్స్ కి ఇది పెద్ద టాస్క్ లాంటిదేనని చెప్పుకోవచ్చు" అని అన్నారు.

'ఘర్షణ' సినిమా అప్పట్లో విడుదలై పెద్ద హిట్ అయింది. అయితే ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకునే ఛాన్స్ లేదు. డిజిటల్  ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్న ఈ రోజులలో ఆ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉండేదో అనిపిస్తుంది. 'ఘర్షణ' సినిమాలో నన్ను నేను చూసుకున్నప్పుడు, కాలం అక్కడ ఆగిపోతే ఎంతో బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది. మంచి పాత్రలు వస్తే, తెలుగులో చేయడానికి సిద్ధంగానే ఉన్నాను" అని చెప్పారు. 


Nirosha
Nirosha actress
Telugu actress
Gharshana movie
Sindhoora Puvvu movie
Nari Nari Naduma Murari
Telugu cinema
South Indian movies
Chiranjeevi
Balakrishna

More Telugu News