రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు.. జమ్ము కశ్మీర్ కోసమా?
- రాష్ట్రపతితో గంటల వ్యవధిలో భేటీ అయిన ప్రధాని, హోంమంత్రి
- జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమంటూ ప్రచారం
- ఆర్టికల్ 370ను రద్దు చేసి ఆరేళ్లు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా సమావేశమయ్యారు. ఆదివారం గంటల వ్యవధిలోనే వీరు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈ వరుస సమావేశాలపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే ఈ భేటీలు జరిగాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేసి ఆరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
బ్రిటన్, మాల్దీవుల పర్యటన తర్వాత రాష్ట్రపతిని ప్రధాని నరేంద్ర మోదీ కలవడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత కొన్ని గంటలకు రాష్ట్రపతితో అమిత్ షా సమావేశమయ్యారు. హోంమంత్రి ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నేతలను కలిశారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది.
రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అదే ఆగస్టు 5కు రెండు రోజుల ముందు కీలక భేటీలు జరగడం గమనార్హం. కచ్చితమైన గడువును నిర్దేశించనప్పటికీ, రాష్ట్ర హోదా పునరుద్ధరణకు పలుమార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.