ఢిల్లీ-విజయవాడ ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం
- దిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ విస్తారా విమానం
- రన్ వే పై ఉన్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం
- విమానంలోనే మూడు గంటలకు పైగా ప్రయాణికుల నిరీక్షణ
- అదే విమానంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్
ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ప్రయాణిస్తున్నారు. సాంకేతిక లోపం గురించి సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పాటు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదని, ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ఘటన విజయవాడకు ప్రయాణించే వారిలో ఆందోళన కలిగించింది.