త్వ‌ర‌లోనే జ‌గ‌న్ అరెస్ట్ అవుతారు: మంత్రి స‌త్య‌కుమార్‌

  • లిక్క‌ర్ స్కామ్‌లో అస‌లైన సూత్ర‌ధారి జ‌గ‌న్ త్వ‌ర‌లోనే అరెస్ట్ అవుతార‌న్న‌ మంత్రి 
  • అందుకే ఆయ‌న సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నారని విమ‌ర్శ‌ 
  • ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకు జ‌గ‌న్ అభూతక‌ల్ప‌న చేస్తున్నార‌న్న‌ మంత్రి స‌త్య‌కుమార్‌
లిక్క‌ర్ స్కామ్ కేసులో అస‌లైన సూత్ర‌ధారి జ‌గ‌న్ త్వ‌ర‌లోనే అరెస్ట్ అవుతార‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ జోస్యం చెప్పారు. అందుకే ఆయ‌న సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేస్తున్నారని విమ‌ర్శించారు. మంత్రి స‌త్య‌కుమార్ నిన్న తిరుప‌తిలో మాట్లాడుతూ... వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ప్ర‌జ‌లు నాసిర‌కం మ‌ద్యం తాగి అనారోగ్యానికి గురికావ‌డం నిజం కాదా? నోట్ల క‌ట్ట‌ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియోలోని వ్య‌క్తి జ‌గ‌న్ అనుచ‌రుడు కాదా? అని నిల‌దీశారు. 

కూట‌మి ప్ర‌భుత్వం అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకు జ‌గ‌న్ అభూతక‌ల్ప‌న చేస్తున్నార‌ని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. త్వరలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌చ్చి జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. అలా కాకుండా దాడి చేస్తాం, విమ‌ర్శ‌లు గుప్పిస్తాం, దూష‌ణ‌ల‌కు దిగుతాం, పారిపోతాం అనే మాట‌లు రాజ‌కీయ నాయ‌కుల ల‌క్ష‌ణం కాద‌న్నారు. కూట‌మి ఏడాది పాల‌న‌పై జ‌గ‌న్ సొంత ఛాన‌ల్‌లో చ‌ర్చ‌కు తాను సిద్ధ‌మ‌ని మంత్రి స‌త్య‌కుమార్ తెలిపారు. 


More Telugu News