Kodali Nani: కొడాలి నానికి విశాఖ పోలీసుల నోటీసులు.. మరోకేసు నమోదు

Kodali Nani Faces Police Inquiry Following Student Complaint in Visakhapatnam



ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024లో ఏయూ లా కాలేజీ విద్యార్థిని అంజనప్రియ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరుకావాలని ఈ నోటీసులలో ఆదేశించారు.

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొడాలి నాని మూడేళ్ల పాటు చంద్రబాబు, లోకేశ్ లను అసభ్యకరరీతిలో దుర్భాషలాడారని అంజనప్రియ ఆరోపించారు. ఓ మహిళగా ఆ తిట్లను భరించలేకపోయానని 2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్టు U/s 353(2), 352, 351(4) సెక్షన్ల కింద సి.ఐ రమణయ్య అప్పట్లో కేసు నమోదు చేశారు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు అందజేశారు.
Kodali Nani
Andhra Pradesh
Visakha Police
Anjana Priya
TDP
Chandrababu Naidu
Lokesh
YSRCP
Gudivada
AP Politics

More Telugu News