Nara Lokesh: కార్మికుల మరణం కలచివేసింది.. గ్రానైట్ క్వారీ ప్రమాదంపై మంత్రి లోకేశ్ విచారం

Nara Lokesh Expresses Grief Over Granite Quarry Accident
––
బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలైన ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. రోజు కూలీలు మృతిచెందడం బాధాకరమని అన్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి సానుభూతి తెలియజేశారు.
Nara Lokesh
Andhra Pradesh
Granite Quarry Accident
Ballikurava
Worker Deaths
Quarry Tragedy
Accident Compensation
AP Government

More Telugu News