Bapatla accident: బాపట్ల జిల్లాలో ఘోరం.. క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు మృతి

Tragedy in Bapatla district Six dead in quarry rockfall



బాపట్ల జిల్లా బల్లికురవలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు మీద పడడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పదహారు మంది కార్మికులు క్వారీలో పని చేస్తుండగా అకస్మాత్తుగా బండరాళ్లు కిందపడ్డాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

దీంతో ఆరుగురు కార్మికులు రాళ్ల కింద పడి నలిగిపోయారని వివరించారు. చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారని అధికారులు వివరించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Bapatla accident
Bapatla granite quarry
granite quarry accident
Andhra Pradesh accident
Ballikurava quarry
quarry accident
stone quarry collapse
Odisha workers
Bapatla district

More Telugu News