Kakinada Murder: కాకినాడ జిల్లాలో దారుణం .. తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్య

Kakinada Mother and Two Daughters Murdered in Samarlakota
  • సామర్లకోటలో ఘటన
  • ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట సీతారామ కాలనీలో గుర్తు తెలియని దుండగులు ఒక మహిళను, ఆమె ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత్య చేశారు. నిన్న రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఈరోజు ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను ములపత్తి మాధురి (30), పుష్పకుమారి (5), జెస్సిలోన (4)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
Kakinada Murder
Kakinada
Samarlakota
Madhuri Mulapathi
Andhra Pradesh Crime
Double Murder
Crime News Andhra Pradesh
Seetharama Colony

More Telugu News