Aamir Khan: ర‌జ‌నీకాంత్ పాదాల‌కు నమస్క‌రించిన‌ ఆమిర్ ఖాన్

Aamir Khan Touches Rajinikanths Feet Greets Co Star With Respect at Coolie Trailer Launch
  • నిన్న‌ చెన్నైలో ఘనంగా ‘కూలీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ 
  • ఈ ఈవెంట్‌కు హాజ‌రైన చిత్ర బృందం
  • రజినీకాంత్‌ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న ఆమిర్ ఖాన్‌
  • అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్‌
కోలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న‌ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కూలీ’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ నిన్న‌ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌, నాగార్జున, ఉపేంద్ర‌, సత్యరాజ్, శృతిహాసన్, సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్, ద‌ర్శకుడు లోకేశ్ క‌న‌గ‌రాజ్‌ హాజరయ్యారు.

అయితే, ఆమిర్ ఖాన్.. రజినీకాంత్‌ పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవ‌డం అంద‌రినీ ఆక‌ర్షించింది. ఇది అభిమానుల మప‌న‌సుల‌ని తాకింది. బాలీవుడ్‌లో అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి ఇంత ఒదిగి ఉండ‌డం ఆమిర్‌కే చెల్లింది అంటూ ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక‌, ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్‌ కీల‌క పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు. ఈ సినిమాలో మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌ ‘దాహా’ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 

కాగా, లోకేశ్‌ కనగరాజ్‌తో ఓ సినిమా చేస్తున్న విషయాన్ని కూడా ఆమిర్ ధ్రువీకరించారు. త్వ‌ర‌లోనే తామిద్దరం కలిసి ఒక పూర్తి లెంగ్త్ సినిమా చేయబోతున్నాం అని తెలిపారు. ఇక‌, నిన్న విడుద‌లైన కూలీ మూవీ ట్రైల‌ర్ సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంద‌నే చెప్పాలి. మ‌రోసారి లోకేశ్ త‌న‌దైన యాక్ష‌న్ డ్రామాతో ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ కూడా బీజీఎం అద‌ర‌గొట్టారు.

ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, శృతిహాసన్, సౌబిన్ షాహిర్, మోనిషా బ్లెస్సీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల‌ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో ఒకేసారి విడుద‌ల కానుంది. 
Aamir Khan
Rajinikanth
Coolie movie
Lokesh Kanagaraj
Kollywood
Bollywood
Nagarjuna
Anirudh Ravichander
Tamil cinema
Indian cinema

More Telugu News