71వ జాతీయ అవార్డులు... తెలుగులో ఉత్తమచిత్రంగా 'భగవంత్ కేసరి'

Bhagavanth Kesari Wins Best Telugu Film at 71st National Awards
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. '12th ఫెయిల్' సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. జాతీయ ఉత్తమనటుడు అవార్డును షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాసే (12th ఫెయిల్) పంచుకున్నారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) పురస్కారానికి ఎంపికయ్యారు. 

ఇక, నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది. జాతీయ ఉత్తమ కన్నడ చిత్రంగా 'కండీలు', జాతీయ ఉత్తమ తమిళ చిత్రంగా 'పార్కింగ్' ఎంపికయ్యాయి. జాతీయ ఉత్తమ హిందీ చిత్రం 'కథల్' ఎంపికైంది. ఇక, జాతీయ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ సినిమా కేటగిరీలో 'హనుమాన్' అవార్డుకు ఎంపికైంది. 

జాతీయ ఉత్తమ సినీ గీతంగా తెలుగు పాట ఎంపికవడం విశేషం. బలగం సినిమాలోని 'ఉరు-పల్లెటూరు' అంటూ సాగే పాటకు జాతీయ పురస్కారం దక్కింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ (వాత్తి) అవార్డుకు ఎంపికయ్యారు. 

జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్ ఎంపికయ్యారు. సూపర్ హిట్టయిన 'బేబీ' చిత్రానికి గాను ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. అంతేకాదు, 'బేబీ' చిత్రానికి గాను పీవీఎన్ఎస్ రోహిత్ జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డుకు ఎంపికయ్యారు. 

జాతీయ అవార్డుల జాబితా

ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
ఉత్తమ జాతీయ చిత్రం: 12th ఫెయిల్ (హిందీ)
ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్, హిందీ)
విక్రాంత్ మస్సే (12th ఫెయిల్, హిందీ)

ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే, హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: విజయ రాఘవన్ (పూక్కాలం, మలయాళం), ముత్తుపెట్టాయ్ సోము భాస్కర్ (పార్కింగ్, తమిళం)

ఉత్తమ సహాయ నటి: ఊర్వశి (ఉల్లుకు, మలయాళం), జానకీ బోడివాలా (వష్, గుజరాతీ)

ఉత్తమ దర్శకత్వం: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ, హిందీ)
ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్
ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు: ఉత్పల్ దత్త (అస్సామీ)
ఉత్తమ సంగీత దర్శకత్వం: జీవీ ప్రకాశ్ కుమార్ (వాతి, తమిళం)
ఉత్తమ నేపథ్య సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్ (యానిమల్, హిందీ)
ఉత్తమ మేకప్: శ్రీకాంత్ దేశాయ్ (సామ్ బహదూర్, హిందీ)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: సామ్ బహదూర్ (హిందీ)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మోహన్‌దాస్ (2018 - ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో, మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్: మిధున్ మురళి (పూక్కాలం, మలయాళం)
ఉత్తమ సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరి హరన్ మురళీ ధరన్ (యానిమల్, హిందీ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): సాయి రాజేశ్ నీలం (బేబీ, తెలుగు), రామ్‌కుమార్ బాలకృష్ణన్ (పార్కింగ్, తమిళం)

ఉత్తమ సంభాషణలు: దీపక్ కింగ్రానీ (సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై, హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: పసంతను మొహపాత్రో (ది కేరళ స్టోరీ, హిందీ)
ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావు (జవాన్ - చెలియా, హిందీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు: పీవీన్ ఎస్ రోహిత్ (బేబీ, తెలుగు)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతివేణి (గాంధీతాత చెట్టు), కబీర్ ఖండారీ, త్రిష థోసర్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్దీప్ (జిప్సీ, నాల్ 2, మరాఠీ)

ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం: హనుమాన్ (తెలుగు)
ఉత్తమ బాలల చిత్రం: నాల్ (మరాఠీ)
ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం: సామ్ బహదూర్ (హిందీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: ఆశిష్ బెండే (ఆత్మపాంప్లెట్, మరాఠీ)

నాన్-ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
ఉత్తమ నాన్-ఫీచర్ చిత్రం: ప్లవరింగ్ మ్యాన్ (హిందీ)
ఉత్తమ స్క్రిప్ట్: సన్ ఫ్లవర్స్ వోర్ ది ఫస్ట్ వన్స్ టు నో (కన్నడ)
ఉత్తమ వాయిస్ ఓవర్: ది సేక్రెడ్ జాక్ - ఎక్స్‌ప్లోరింగ్ ది ట్రీస్ ఆఫ్ విషెస్ (ఇంగ్లీష్)
ఉత్తమ సంగీత దర్శకత్వం: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
ఉత్తమ ఎడిటింగ్: మూవీంగ్ ఫోకస్ (ఇంగ్లీష్)
ఉత్తమ సౌండ్ డిజైన్: దుందగిరి కే ఫూల్ (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: లిటిల్ వింగ్స్ (తమిళం)
ఉత్తమ దర్శకత్వం: ది ఫస్ట్ ఫిల్మ్ (హిందీ)
ఉత్తమ ఆర్ట్స్/కల్చర్ చిత్రం: టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)
ఉత్తమ బయోగ్రాఫికల్ చిత్రం: మా బావు, మా గావ్ (ఒడిశా), లెంటినో ఓవో ఏ లైట్ ఆన్ ది ఈస్ట్రన్ హారిజాన్ (ఇంగ్లీష్)

ఉత్తమ పరిచయ దర్శకుడు: మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా (మిజో)

స్పెషల్ మెన్షన్ చిత్రాలు: నేకల్: క్రానికల్ ఆఫ్ ప్యాడీ మ్యాన్ (మలయాళం), ది సీ అండ్ సెవెన్ విలెజెస్ (ఒడియా)

Go Back to Shorts
Bhagavanth Kesari
71st National Film Awards
National Film Awards
Balakrishna
Anil Ravipudi
Telugu cinema
Indian cinema
HanuMan
Baby movie
Kasarla Shyam

More Telugu News