‘కింగ్డమ్‌’ సినిమా తొలిరోజు క‌లెక్ష‌న్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్

  • విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘కింగ్డమ్‌’ 
  • నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా
  • మొద‌టి రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.39 కోట్లకు పైగా గ్రాస్‌ వ‌సూళ్లు
టాలీవుడ్ రౌడీ బాయ్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన తాజా చిత్రం ‘కింగ్డమ్‌’ నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మూవీకి మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా తొలి రోజు భారీ క‌లెక్ష‌న్లు సాధించ‌డం విశేషం. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మొద‌టి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.39 కోట్లకు పైగా గ్రాస్‌ వ‌సూళ్లు సాధించిన‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఎక్స్ వేదిక‌గా స్పెష‌ల్‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో విజ‌య్ స‌ర‌స‌న‌ క‌థానాయిక‌గా భాగ్య‌శ్రీ భోర్సే న‌టించ‌గా.. యువ న‌టుడు స‌త్య‌దేవ్, మ‌ల‌యాళం న‌టుడు వెంకిటేశ్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించాడు. 


More Telugu News