‘కింగ్డమ్‌’ సినిమా చూసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. నెట్టింట ఫొటోలు వైర‌ల్‌

  • విజ‌య్ దేవ‌ర‌కొండ, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబోలో ‘కింగ్డ‌మ్’
  • నిన్న విడుదలైన చిత్రానికి మిక్స్ డ్ టాక్
  • అప‌ర్ణ సినిమాస్‌లో తాజాగా ఈ మూవీని వీక్షించిన జ‌క్క‌న్న‌  
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా, గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం ‘కింగ్డ‌మ్’. ఈ సినిమా నిన్న ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న‌ విష‌యం తెలిసిందే. తాజాగా ఈ మూవీని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌ రాజ‌మౌళి ఫ్యామిలీతో క‌లిసి వీక్షించారు. శేరిలింగంప‌ల్లి ప‌రిధిలోని నల్లగండ్ల అపర్ణ మాల్‌లోని అప‌ర్ణ సినిమాస్‌లో ఆయ‌న మూవీని చూశారు. 

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌, ఇటీవ‌ల హాలీవుడ్ మూవీ 'F1' చూడ‌డానికి వ‌చ్చి మీడియా కంటప‌డ్డ జ‌క్క‌న్న‌ మ‌రోసారి సినిమాకు వ‌చ్చి కెమెరాకు చిక్కారు. కాగా, ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో రాజ‌మౌళి ఓ భారీ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. 'ఎస్ఎస్ఎంబీ29' వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  


More Telugu News