ఐదో టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి భార‌త్

  • తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న‌ ఇంగ్లండ్
  • గాయం కార‌ణంగా మ్యాచ్‌కు దూర‌మైన కెప్టెన్ స్టోక్స్ 
  • అత‌ని స్థానంలో ఓలీ పోప్‌కు జ‌ట్టు ప‌గ్గాలు
  • జ‌ట్టులోకి చేరిన జురెల్‌, క‌రుణ్, ప్ర‌సిద్ధ్‌ కృష్ణ, ఆకాశ్ దీప్
టీమిండియాతో ఐదో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్‌.. బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ దూరం అయ్యాడు. నాలుగో టెస్టులో గాయ‌ప‌డిన‌ అత‌ని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. ఇక‌, టీమిండియా వ‌రుస‌గా 15వ సారి టాస్ ఓడిపోయింది. 

ఈ మ్యాచ్‌లో భార‌త‌ జ‌ట్టు నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. గాయ‌ప‌డ్డ రిష‌బ్ పంత్ స్థానంలో వికెట్ కీప‌ర్‌గా ధ్రువ్ జురెల్‌ను తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో క‌రుణ్ నాయ‌ర్, బుమ్రా స్థానంలో ప్ర‌సిద్ధ్‌ కృష్ణను తీసుకున్నారు. అలాగే అన్షుల్‌ కాంబోజ్ స్థానంలో ఆకాశ్ దీప్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. అటు, ఇంగ్లండ్ జ‌ట్టులో కూడా మార్పులు జ‌రిగాయి. గ‌స్ అట్కిన్‌స‌న్‌, జేమీ ఓవ‌ర్ట‌న్‌, జోష్ టంగ్‌లు జ‌ట్టులోకి చేరారు.

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భార‌త్ 1-2 తేడాతో వెనుక‌బ‌డి ఉన్న విష‌యం తెలిసిందే. అందుకే ఐదో టెస్టు టీమిండియాకు చాలా కీల‌కం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ స‌మం అవుతుంది. ఒక‌వేళ మ్యాచ్ డ్రా అయితే ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టు సిరీస్ విజేత‌గా నిలుస్తుంది. 

ఇక‌, టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన గిల్ సేన‌కు ఆదిలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. జ‌ట్టు స్కోరు 10 ప‌రుగుల వ‌ద్ద ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (2) పెవిలియ‌న్ చేరాడు. కేవ‌లం రెండు ర‌న్స్ చేసి, అట్కిన్‌స‌న్ బౌలింగ్‌లో ఎల్‌బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం భార‌త్ స్కోర్: 17/1 (7 ఓవ‌ర్లు) ఉండ‌గా.. క్రీజులో కేఎల్ రాహుల్ (8), సాయి సుద‌ర్శ‌న్ (5) ఉన్నారు. r


More Telugu News