‘కింగ్డమ్‌’ చూసిన కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు.. సినిమా చాలా న‌చ్చిందంటూ ట్వీట్

  • విజ‌య్ దేవ‌ర‌కొండ, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబోలో 'కింగ్డమ్' 
  • ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మూవీ
  • స్నేహితులతో కలిసి ‘కింగ్డమ్‌’ సినిమా చూసిన కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు
  • మూవీలో విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉందంటూ కితాబు
రౌడీ బాయ్‌ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన‌ ‘కింగ్డమ్‌’ చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఖుషి, లైగ‌ర్, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల‌తో తీవ్రంగా నిరాశ చెందిన‌ విజ‌య్ ఎలాగైన హిట్టు కొట్టాల‌నే క‌సితో ఈ సినిమా చేశారు. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. 
 
ఇక‌, తాజాగా ఈ సినిమాను చూసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు ‘కింగ్డమ్‌’పై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ మేర‌కు 'ఎక్స్' వేదిక‌గా పోస్ట్ పెట్టాడు. 

"ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌లో నా స్నేహితులతో కలిసి ‘కింగ్డమ్‌’ సినిమా చూశాను. ఒక థియేటర్‌లో ఇంత మంచి అనుభూతి పొందడం నాకు ఇదే మొదటిసారి!. స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉండ‌డంతో ప్రేక్షకులంతా సినిమాను బాగా ఎంజాయ్ చేస్తూ అరుస్తున్నారు. థియేట‌ర్‌ వాతావరణం మొత్తం గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండ‌డ‌మే కాకుండా చాలా ఎనర్జీ కనిపించింది. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన చాలా అద్భుతంగా ఉంది. సినిమా అయితే నాకు చాలా నచ్చింది" అంటూ హిమాన్షు ట్వీట్ చేశారు. 


More Telugu News